కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌతమ్ తెలిపారు. దాడుల్లో సిబ్బంది వెంకటనారాయణ, గురవయ్య, సుమంత్, పార్థసారథి పాల్గొన్నారు.