టేకులపల్లి మండలం సంపత్నగర్ సమీపంలోని వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బుధవారం బోడు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పట్టుకున్న ట్రాక్టర్లను తహసీల్దార్కు అప్పగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.