విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యమని వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్. వి. వేణుగోపాలచారి గురువారం అన్నారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి సెక్షన్ల వినియోగదారులకు బొమ్మనపల్లి సబ్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్లో సమస్యలు పెండింగ్లో లేవని చెప్పారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.