మండలంలోని హరిజనవాడ ప్రధాన రోడ్డు పైనే నీరు.. బాగు చేసే వారేరి.? రోడ్డు పైనే నీరు నిలిచిపోయి ఉండడంవల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అందులో వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున దోమలు పెరిగి రోగాల బారిన పడతామనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వర్షం పడితే చెరువుల తలపిస్తుందని హరిజనవాడ ప్రజలు తెలుపుతున్నారు. ప్రజా ప్రతినిధులు త్వరగా చొరవ చూపించి అధికారులచే మాకు కలిగిన ఇబ్బందిని తొలగించాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.