మంగళవారం రాత్రి ఇల్లెందు మండలంలోని తిలక్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అభితేజ్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. నూతనంగా నిర్మించిన ఇంటికి సాయంత్రం మోటార్ ద్వారా నీళ్లు కొట్టగా, నిద్రించే సమయంలో స్వీబ్బోర్డు నుంచి వైర్ తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అభితేజ్‌ను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.