TG: కోఠి కాల్పుల కేసులో నిందితుల కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి తిరిగి బయటకు వచ్చిన నిందితులు ఆటో ఎక్కి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారు ఆటోలో సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు సమాచారం లభించడంతో, ఆ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కదలికలు, వారు వెళ్లిన మార్గాలపై డ్రైవర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.