TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని, హరీశ్ రావును 'గుంటనక్క' అని విమర్శించారు. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, కేసీఆర్ కొడుకు కాకపోతే రాజకీయ మనుగడ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై కేటీఆర్ మాట్లాడటం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు.