ఎర్రవల్లికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు

తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ శాసనసభాపక్ష (BRSLP) సంయుక్త సమావేశాన్ని ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నివాసంలో ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సభలో ఎలా ఎండగట్టాలనే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ఎర్రవల్లికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕