TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలి..? కేటీఆర్ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధుడా అని ప్రశ్నించారు. సర్కార్ సొమ్మును అక్రమంగా కట్టబెట్టి పైగా అడ్డగోలుగా మాట్లాడతవా అని కేటీఆర్‌పై మండిపడ్డారు.