వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు కేటీఆర్ పిలుపు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వరంగల్‌ను పాత వైభవం గల టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 2017లో కేసీఆర్ ప్రారంభించిన ఈ పార్క్‌లో కైటెక్స్, యంగ్‌వన్, గణేశా వంటి సంస్థలు ఏర్పడి త్వరలో 25-30 వేల మందికి ఉపాధి కల్పించనున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్, డ్రైనేజ్, సివరేజ్ పనులను పూర్తి చేసి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. BRS ప్రతి విధంగా సహకరిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్