హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ సమీపంలోని నిమ్రా కేఫ్ అండ్ బేకరీని గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్, బిస్కెట్లకు పేరొందిన ఈ కేఫ్‌లో కేటీఆర్ కొంతసేపు గడిపి, అక్కడి వారితో ముచ్చటించారు. పాతబస్తీ పర్యటనలో భాగంగా కేటీఆర్ నిమ్రా కేఫ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.