TG: రిజర్వేషన్ల పెంపుతో తెలంగాణ సమాజం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం తెచ్చిన 14 బిల్లులకు మీ పదేళ్ల కాలంలో బీజేపీకి మద్దతు తెలిపారు. కానీ బీసీలకు 22% నుంచి 42% పెంచడానికే మీకు చాతకాలేదు' అని విమర్శించారు.