TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, MLA హరీశ్‌రావు నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. చర్చకు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్‌కు సిద్ధమయ్యారు. జూపల్లి వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, ఆర్‌బీఐ లెక్కలు వివరిస్తామని కేటీఆర్, హరీశ్‌రావులు సవాల్ విసిరారు. అయితే రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల సమస్యలపై చర్చకు రావాలంటూ ఇటీవల KTR విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ.. తాను నేరుగా తెలంగాణ భవన్‌కు వచ్చి చర్చిస్తానని నిన్న మంత్రి జూపల్లి ప్రకటించారు.