TG: పదేళ్ల పాలనలో కేసీఆర్ మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా హకీంపేటలో మాట్లాడుతూ.. 'చెల్లికి ఆస్తిలో వాటాను ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ సొంత చెల్లినే ఇంటి నుంచి బయటికి గెంటేశారు. చెల్లి ఏదైనా తప్పు చేసినా.. క్షమించి అక్కున చేర్చుకునే వాడే అన్న. కేటీఆర్‌ను సొంత చెల్లి కూడా నమ్మడం లేదు. కేసీఆర్, కేటీఆర్ పదేళ్లలో మహిళలకు ఏమిచ్చారో అడగండి' అని అన్నారు.