TG: గ్రేటర్ హైదరాబాద్ BRS నేతలతో నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీకానున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు వంటి అంశాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.