తెలంగాణ భవన్లో మూడు జిల్లాల నేతలతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో సమావేశమైన కేటీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. పార్టీ వ్యూహం, ఓటర్ల నమోదు, సంబంధిత అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు.