KTRకు తీవ్ర అనారోగ్యం.. రంగంలోకి హరీశ్ రావు!

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో మంగళవారం హాజరుకానున్న పలు కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ స్థానంలో మాజీమంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. గత రెండు, మూడు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు కేటీఆర్. దీంతో కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. సోమవారం వరంగల్ జిల్లా పర్యటనను కూడా కేటీఆర్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్