TG: కాళేశ్వరంపై కేటీఆర్ కొత్త కథలు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 'కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఎవరైనా చూడొచ్చని చెప్పిందే మా ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లాలని చూస్తే అరెస్ట్ చేశారు. పనీపాట లేక కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారు. అరెస్ట్ చేస్తే సానుభూతి పొందవచ్చన్నది కేటీఆర్ ఆలోచన' అని అన్నారు.