ఏసీబీ ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్

ఏసీబీ కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడగా.. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. 'నా స్టేట్‌మెంట్‌ను ఏఎస్పీకి ఇచ్చాను. పోలీసులు రాజమౌళి కంటే మంచి కథలు రాస్తున్నారు. అందుకే పోలీసులను నేను నమ్మను. లాయర్ ఉంటేనే నా హక్కులకు రక్షణ' అన్నారు. ఇక చాలా సేపు అక్కడే వెయిట్ చేసిన కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్