గన్‌పార్క్‌కు బయల్దేరిన కేటీఆర్.. అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ భవన్ ఎదుట మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి గన్‌పార్క్ వద్దకు వచ్చారనే సమాచారంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చకు సిద్ధమయ్యారు. తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వరకు ఆయన నడుచుకుంటూ బయలుదేరారు. అయితే, ఈ ఉద్రిక్తత మరింత పెరగకుండా చూసేందుకు పోలీసులు రంగంలోకి దిగి, తెలంగాణ భవన్ గేటు వద్దే కేటీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను అడ్డుకున్నారు. కేటీఆర్ పాదయాత్రను పోలీసులు నిలిపివేయడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్