TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ ప్రచారంలో మాట్లాడుతూ..'కేటీఆర్.. మీ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. సొంత చెల్లె నీ ఇంటి మీద ఆరోపణలు చేసింది. ఏ ఆడబిడ్డ సొంత ఇంటి మీద ఆరోపణలు చేయదు. సొంత చెల్లిని పట్టించుకోని వారు.. చిన్నమ్మ బిడ్డలను చూస్తారా? ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ చెల్లిని పక్కనపెట్టాడు' అని ఆరోపించారు.