TG: సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, నేతలతో గురువారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. రామగుండం సభ, తదుపరి కార్యాచరణపై చర్చించారు. మరోవైపు శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ వెళ్లనున్నారు. అక్కడ నీటి ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి జలాలను ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.