CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

TG: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. విదేశీ బొగ్గు అంశంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎంకు దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ విసిరారు. అలాగే, నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు KTR ప్రకటించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు చేపడతామని కేటీఆర్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕