ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిన్న ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'పవన్ కల్యాణ్‌ను తెలంగాణలో ప్రజలే అడ్డుకున్నారు. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి.. రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది. ప్రాంతీయవాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ అన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. దాన్ని తప్పు పడతారా? జాతీయవాదం గురించి పవన్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని అన్నారు.