TG: సీఎం రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కేటీఆర్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి చర్చలకు వస్తారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు అసలు, వడ్డీ కడుతున్నాం. రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి' అని మండిపడ్డారు.