ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ శ్రేణులకు కీలక పిలుపినిచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కోట అని, రెండున్నర దశాబ్దాలుగా అన్ని ఎన్నికల్లో పార్టీ వెంట ప్రజలు నిలబడ్డారని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి మరోసారి కరీంనగర్ గడ్డ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.