TG: రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల తరఫున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. పేద, మధ్యతరగతి గ్రామీణ వర్గాల యువత ఆశలపై నీళ్లు చల్లవద్దని, నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదని, బీఆర్ఎస్ హయాంలో 47 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు.