TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రుల కొడుకులు దౌర్జన్యాలు చేస్తే కేసులు ఉండవని, వేరే పార్టీల ఎంపీల కుమారులు హైదరాబాద్‌లో ప్రమాదాలు చేసినా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. నడిరోడ్డుపై ప్రైవేట్ ఉద్యోగిని ఢీకొట్టి చంపినా ఆ ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయలేదని, హైటెక్ సిటీలో జరిగిన ఘటన వీడియోలు ఎందుకు దాచారని కేటీఆర్ ప్రశ్నించారు.