ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. సంక్రాంతి తర్వాత మళ్లీ విచారణ జరుగుతుందని సమాచారం. రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ నే తిప్పి తిప్పి అడిగారు తప్పా వాళ్లు కొత్తగా అడిగింది లేదని కేటీఆర్ అన్నారు. అదే విధంగా ఎన్ని సార్లు విచారణకు పిలిచినా సహకరిస్తానని ఏసీబీ అధికారులకు తెలిపినట్టు కేటీఆర్ మీడియాతో తెలిపారు.