TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తూ కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం చేవెళ్లలో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని, రైతుబంధు సాయాన్ని మూడుసార్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందని, పెట్టుబడులు, నిర్మాణ రంగం మందగించాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.