ఏపీ మంత్రి నారా లోకేష్‌ను బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ రహస్యంగా కలిశారంటూ పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము బనకచర్ల కోసం కొట్లాడుతుంటే.. కేటీఆర్ నారా లోకేష్‌తో రహస్య మంతనాలు చేస్తున్నారని, కేటీఆర్.. నారా లోకేష్‌ను రెండుసార్లు కలిశారని ఆరోపించారు. ఎందుకు కలిశారో కచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పు అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయట పెడుతానంటూ పేర్కొన్నారు.