TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే రక్షించి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించానని కేటీఆర్ తెలిపారు.