ఘోర విమాన ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి

గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని చెప్పారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర, గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్