KTR అహంకారంతో మాట్లాడారు: సీతక్క

TG: కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్రంగా ఫైర్ అయ్యారు. వరంగల్ సభలో కేటీఆర్ అహంకారపూరితంగా, అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. వారు పెంచిపోషిస్తున్న యూట్యూబర్లు, పెయిడ్ బ్యాచ్‌తో సీఎంను తిట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎయిడ్స్ ఉందంటూ SMలో తనపై వస్తున్న అసత్య ప్రచారాల పట్ల కవిత కన్నీరు పెట్టుకున్నారని, దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. అనవసరమైన తప్పుడు విమర్శలు మానుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕