TG: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ప్యారడైజ్ మూవీని చూసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌కు వచ్చారు. అభిమానులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సినిమా చూస్తున్నారు. ఈ మూవీలో 'శంకరన్న' పాత్ర కేసీఆర్‌ను పోలి ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.