తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉండరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు కేటీఆర్‌తో మంచి సోదరభావ సంబంధం ఉందని, అనేక సందర్భాల్లో ఇద్దరం కలిశామని, తమ మధ్య పరస్పర ఇష్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, తామిద్దరం ఎప్పుడైనా కలిసినప్పుడు దీని గురించి సరదాగా మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ తేలికగా వ్యాఖ్యానించారు.