TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం నీటితో పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజుల కిందటి వరకు నీరు లేక వెలవెలబోయిన ఈ వాటర్ ఫాల్.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకుంది. చిన్నగా మొదలైన నీటి ప్రవాహం ఉద్ధృతంగా మారుతోంది. దీంతో జలపాతం అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.