AP: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో శుక్రవారం జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 20 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటనలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. నవీన్ అనే వ్యక్తి ఆరుగురు బాధితులను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక డీఐజీ కోయ ప్రవీణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.