కర్నూలు బస్సు ప్రమాదం.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు (వీడియో)

AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. "అర్ధరాత్రి 2 గంటలకు లక్ష్మీపురం నుంచి తుగ్గలికి బయలుదేరిన శివశంకర్, ఎర్రిస్వామి, మార్గమధ్యంలో 2.24 గంటలకు పెట్రోల్ కోసం బంక్‌కి వెళ్లారు. చిన్నటేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయ్యి రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టగా, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడి, స్పాట్‌ నుంచి సొంతూరుకు పారిపోయాడు" అని తెలిపారు. కాగా, ఎర్రిస్వామిని తీసుకువెళ్ళి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.

సంబంధిత పోస్ట్