కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుల కుటుంబాలకు వి.కావేరి ట్రావెల్స్ యాజమాన్యం పరిహారం అందజేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.40 లక్షలను మంత్రి భరత్ సమక్షంలో అందజేసింది. అటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.