AP: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బైక్, బస్సు ప్రమాదాలు వేర్వేరు ఘటనలుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి తెలిపాడు. రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో తాను, శివశంకర్ ఎగిరిపడ్డామని, అతడు అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పాడు. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో ప్రమాదం జరిగిందని తెలిపాడు.