AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైకర్ శివశంకర్ స్నేహితుడిని పోలీసులు గుర్తించారు. శుక్రవారం వేకువజామున శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి బైక్‌పై డోన్ బయలుదేరాడు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ ఎగిరిపడ్డారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో ఎర్రిస్వామి ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయాడు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.