కర్నూలు ఘటన.. మరిన్ని వివరాలు వెల్లడించిన ఎస్పీ

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశంకర్ బైక్‌పై మరో యువకుడు ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశామన్నారు. ఎర్రిస్వామి అనే యువకుడు హైదరాబాద్ GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతడిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బస్సులో 250 స్మార్ట్ ఫోన్ల రవాణాపై FSL నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్