క్షిప‌ణి, డ్రోన్ దాడుల‌ను తిప్పికొడుతున్నాం: కువైట్ ఆర్మీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. శత్రు దేశాలకు చెందిన మిస్సైల్, డ్రోన్ దాడులు జరుగుతున్నట్లు కువైట్ ఆర్మీ ప్రకటించింది. అయితే, ఆ దాడులను తమ వైమానిక రక్షణ దళం విజయవంతంగా తిప్పికొట్టినట్లు కువైట్ ఆర్మీ తెలిపింది. దేశ ప్రజలు భద్రతా సూచనలను పాటించాలని కోరింది. తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు దేశాలకు చెందిన మిస్సైళ్లు, డ్రోన్లతో పోరాడుతున్నాయని, భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తే అవి ఎయిర్ డిఫెన్స్ దాడులుగా గుర్తించాలని కువైట్ ఆర్మీ తెలిపింది.

సంబంధిత పోస్ట్