కార్మిక దినోత్సవం.. చికాగోలో మొదలైన పోరాటం

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్మికులు రోజుకు 12-16 గంటలు పనిచేసే దుస్థితి ఉండేది. '8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం' నినాదంతో కార్మికులు ఐక్యమై 1886 మే 1న అమెరికాలోని చికాగోలో సమ్మెకు దిగారు. మే 4న హేమార్కెట్ స్క్వేర్‌లో శాంతియుత సభపై బాంబు దాడి, పోలీసుల కాల్పుల్లో కార్మికులు మరణించడం, నాయకులకు అన్యాయంగా ఉరిశిక్ష విధించడం కార్మిక ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఆ రక్తపు మడుగులోంచి ఒక కార్మికుడు రక్తసిక్త రుమాలును కార్మిక జెండాగా ఎగురవేశాడు. అప్పటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే)గా జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్