లడఖ్‌లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు తరలించారు. అరబ్ విప్లవం, నేపాల్ జెన్-Z ఉద్యమాలను ప్రస్తావిస్తూ లడఖ్ యువతను రెచ్చగొట్టారని కేంద్రం ఆరోపిస్తోంది. వాంగ్‌చుక్‌పై పాకిస్తాన్ ఏజెంట్‌తో సంబంధాలున్నాయని, విదేశీ నిధులపై కూడా దర్యాప్తు జరుగుతోందని లడఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు.