శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోనే మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీటీడీ అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.