లఖ్‌పతి దీదీ యోజన పథకం ద్వారా మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వాటిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారం, బిజినెస్‌కు సంబంధించిన శిక్షణను అందిస్తారు. అనంతరం రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు వదిలేని రుణం అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి.