నెట్‌ఫ్లిక్స్‌కు క్షమాపణలు చెప్పిన హీరో విష్ణు విశాల్

సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా పరాజయానికి తాను బాధ్యత వహిస్తూ, నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులకు స్వయంగా క్షమాపణలు చెప్పినట్లు హీరో విష్ణు విశాల్ వెల్లడించారు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో సినిమా ముందుకు వెళ్లలేదని, అందుకే క్షమాపణలు చెప్పానని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఆయనను ఓదార్చి, పరాజయానికి పూర్తిగా తానే బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సూచించినట్లు విష్ణు విశాల్ తెలిపారు. సుమారు రూ.80-90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్