బెల్లి లలిత 1972 ఏప్రిల్ 29న యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం నంచారిపేటకు చెందిన ఓ నిరుపేద కురుమ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒగ్గు కథలు చెప్పే కళాకారుడు, కూలీవాడు. లలితకు ఒక అన్న (కృష్ణ), ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేకపోయింది. చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోసేందుకు భువనగిరి సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది.